Sajjala Ramakrishna Reddy: ఆ 23 చోట్ల కూడా మీ పేరు చెబితేనే భగ్గుమంటున్నారు: చంద్రబాబుపై సజ్జల విసుర్లు

Sajjala Ramakrishnareddy furious over TDP Chief Chandrababu
  • అమరావతిపై దొంగ పోల్స్ నిర్వహిస్తున్నారంటూ విమర్శలు
  • ఆ ఫలితాలు ఎలావుంటాయో అందరికీ తెలుసని వ్యాఖ్యలు
  • కుళ్లు, కుతంత్రాలు విడిచిపెట్టాలంటూ చంద్రబాబుకు హితవు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 'చంద్రబాబు గారూ, ఎన్నికలు ముగిసి 14 నెలలు కూడా జరగలేదు, మీరు గెలిచిన 23 చోట్ల కూడా మీ పేరు చెబితేనే భగ్గుమంటున్నారు' అంటూ విమర్శించారు. అలాంటి మీరు అమరావతి పై దొంగ పోల్స్ నిర్వహిస్తున్నారని, మీ టీవీలు, మీ పేపర్లు, మీ వెబ్ సైట్లలో పెట్టే పోల్స్ లో ఫలితాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసని ట్వీట్ చేశారు.

"రాజకీయ కెరీర్ లో చివరి దశలో ఉన్న మీరు ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయండి, కుళ్లు కుతంత్రాలు విడిచిపెట్టండి. మీ మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చే పద్ధతులు విడనాడండి. విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్ని చిమ్మకండి. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి" అంటూ వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Polls
Media
Telugudesam
Amaravati
YSRCP
Andhra Pradesh

More Telugu News