Chandrababu: శ్రీశైలం ఘటనలో మరణించిన సుందర్ నాయక్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

 Chandrababu talked to AE Sundar Naik family members
  • ఇటీవల శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
  • 9 మంది మృతి
  • విధి నిర్వహణలో కన్నుమూసిన ఏఈ సుందర్ నాయక్
కొన్నిరోజుల కిందట శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది బలైన సంగతి తెలిసిందే. మృతిచెందినవారిలో ఏఈ సుందర్ నాయక్ కూడా ఉన్నారు. సుందర్ నాయక్ స్వస్థలం సూర్యాపేట. తాజాగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏఈ సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందర్ కుటుంబసభ్యులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఇటీవల శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్యానెల్ బోర్డులో చెలరేగిన మంటలు కొద్దిసేపట్లో ప్లాంట్ లోని పలు యూనిట్లను చుట్టుముట్టాయి. దాంతో 9 మంది మృత్యువాతపడ్డారు.
Chandrababu
Sundar Nai
AE
Srisailam Powerplant
Fire Accident

More Telugu News