Andrew Fleming: తెలంగాణలో ఇంటి తలుపులన్నీ ఈ రెండు రంగుల్లోనే ఉన్నాయి... కారణమేంటి? యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆశ్చర్యం

  • యూకే డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న ఫ్లెమింగ్
  • ఇక్కడి సంస్కృతి పట్ల విస్మయం
  • ఫ్లెమింగ్ కు బదులిచ్చిన ఓ నెటిజన్
UK Dy High Commissioner Andrew Fleming wondered why doors in Telangana villages

హైదరాబాదులోని తెలుగు రాష్ట్రాల బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను తెలంగాణలోని ఓ అంశం విపరీతంగా ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలోని గ్రామాల్లో ఇంటి తలుపులు ప్రధానంగా రెండు రంగుల్లోనే ఉన్నాయని, గ్రీన్, బ్లూ కలర్ లోనే కనిపిస్తున్నాయని, ఇలా ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు.

దీనికి ఓ నెటిజన్ వెంటనే స్పందించాడు. ఇది తెలంగాణ ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం అని, తెలంగాణ సంస్కృతిలో ఇమిడిపోయిన అంశం అని తెలిపారు. మీరు ఎంతో నిష్కల్మషంగా, అమాయకంగా అడిగిన ఈ అంశాన్ని ఎవరైనా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని, పువ్వులను కూడా కొన్నింటికి ప్రతీకలుగా భావిస్తున్న రోజులని తెలిపారు. దీనికి ఆండ్రూ ఫ్లెమింగ్ బదులిస్తూ... ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని తనకు తెలుసని పేర్కొన్నారు. కానీ తనకు అలాంటి ఉద్దేశాలు లేవని భావిస్తున్నానని తెలిపారు.


More Telugu News