kangana ranaut: 'బాయ్‌కాట్ కంగన' హ్యాష్‌ట్యాగ్‌పై హీరోయిన్ కంగనా రనౌత్ మండిపాటు!

kangana allegations on bollywood
  • ఎలుకలు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి
  • బాయ్‌కాట్ కంగన అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది
  • బాలీవుడ్ మాఫియా చేయగలిగిన పనులన్నీ చేస్తుంది
  • నా ట్విట్టర్ అకౌంట్‌ను కూడా నిలిపివేసేందుకు ప్రయత్నం
బాలీవుడ్‌లో ఓ వర్గం వారిపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో 'బాయ్‌కాట్ కంగన' హ్యాష్‌ట్యాగ్‌తో చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ... ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయని ఆమె పేర్కొంది.

బాయ్‌కాట్ కంగన అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉందని ట్వీట్ చేసింది. బాలీవుడ్ మాఫియా చేయగలిగిన పనులన్నీ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించింది. తన ట్విట్టర్ అకౌంట్‌ను కూడా నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పింది. వారు ఈ ప్రయత్నాల్లో విజయవంతం అయ్యేలోగా తాను కొందరి వ్యవహారాలను బయటపెడతానని కంగన ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
kangana ranaut
Bollywood
Twitter

More Telugu News