Sirigireddy Gangi Reddy: కరోనా భయంతో ఏపీ కాంగ్రెస్ నేత గంగిరెడ్డి ఆత్మహత్య

Congress leader Sirigireddy Gangi Reddy commits suicide with fears of Corona
  • కడప జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి ఆత్మహత్య
  • గత వారం కరోనా బారిన పడిన వైనం
  • ఎర్రగుంట్ల మండలంలో రైల్వే ట్రాక్ పై శవం
మన దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మరణాలు సైతం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు, కరోనా కంటే... దాని పట్ల భయంతో ప్రాణాలు వదులుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కరోనా భయంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి గంగిరెడ్డికి గత వారం కరోనా సోకింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఆయన వెళ్లిపోయారు. ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. కరోనా భయంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Sirigireddy Gangi Reddy
Kadapa District
Congress
Suicide
Corona Virus

More Telugu News