USA: మొబైల్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతా తెరిచి చూస్తే... రూ. 18,166 కోట్లు.. అవాక్కయిన కస్టమర్!

  • యూఎస్ లోని మసాచుసెట్స్ లో ఘటన
  • బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వ్యక్తికి ఖాతా
  • పొరపాటును సరిదిద్దుకున్నామన్న బ్యాంకు
Two and Half Billion Dollors in American bank Account

ఇటీవల అమెరికాలో సిటీ గ్రూప్ ఐఎన్సీ పొరపాటున 900 మిలియన్ డాలర్లను పలువురి ఖాతాల్లో వేసిందన్న వార్త కలకలం సృష్టించగా, ఇది అంతకుమించి చర్చనీయాంశమైంది. మసాచుసెట్స్ లో తన బ్యాంకులో ఎంత డబ్బుందో చూసుకుందామని ఆ ప్రాంతంలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న బ్లెయిసీ అగ్వైర్ అనే వ్యక్తి మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయి చూడగా, ఏకంగా రూ. 18,166 కోట్లు (సుమారు రూ.2.45 బిలియన్ డాలర్లు) కనిపించడంతో అవాక్కయ్యాడు. అతనికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది.

ఆ వెంటనే అతను తన రిలేషన్ షిప్ మేనేజర్ ను తనది కాని ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలని చెప్పారు. ఈ వార్త వైరల్ కావడంతో, ఈ విషయమై, బ్యాంక్ ఆఫ్ అమెరికాను బ్లూమ్ బర్గ్ వార్తా సంస్థ సంప్రదించింది. అదో డిస్ ప్లే ఎర్రర్ మాత్రమేనని, అంతకన్నా మరేమీ కాదని బ్యాంకు ప్రతినిధి బిల్ హాల్దిన్ వ్యాఖ్యానించారు. ఆ డబ్బును వెంటనే వెనక్కు తీసేసుకున్నామని అన్నారు.

More Telugu News