Aravind Kejriwal: నిన్న మేము ఏం చేశామో... నేడు ట్రంప్ అదే చేస్తున్నారు: కేజ్రీవాల్

Kejriwal Said What We Have Done Yesterday Us Doing Today
  • ప్లాస్మా థెరపీపై మాట్లాడిన ఢిల్లీ సీఎం
  • గతంలో ఉన్న పరిస్థితులు మారిపోయాయి
  • ఈ ఘనత సాధించిన ప్రజలకు కృతజ్ఞతలన్న కేజ్రీవాల్
కరోనాలో చికిత్సకు ప్లాస్మా థెరపీని వినియోగించేందుకు యూఎస్ ఎఫ్డీయే ఆమోదించిందన్న విషయాన్ని రెండు రోజుల క్రితం అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించగా, అదే విషయాన్ని ప్రస్తావించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ విషయాన్ని తాము ముందే గ్రహించామని అన్నారు. నిన్న ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందో, నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే మాటంటున్నారని అన్నారు.

"గతంలో ఏదైనా అమెరికా చేసిన తరువాతనే ఇండియా చేస్తుందని అనేవారు. నేడు అమెరికా చేస్తున్నది రేపు ఇండియా చేస్తుందన్న వ్యాఖ్యలు ఇక ఉండవు. ఢిల్లీ దాన్ని మార్చేసింది. నిన్న ఢిల్లీ చేసిన పనిని నేడు అమెరికా చేస్తున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ వాసులకు, ఈ ఘనత సాధించిన దేశానికి నా కృతజ్ఞతలు" అని ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను కూడా కేజ్రీవాల్ జోడించారు. కాగా, గతంలో కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ పనికిరాదని వ్యాఖ్యానించిన ట్రంప్, ఆదివారం నాడు మాట్లాడుతూ, ప్లాస్మా థెరపీ చక్కగా పనిచేస్తుందని అన్న సంగతి తెలిసిందే.
Aravind Kejriwal
Plasma Theraphy
Donald Trump

More Telugu News