Kim Jong-un: ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ చనిపోయారంటున్న జర్నలిస్టు!

  • కిమ్ ఆరోగ్యంపై ఆగని ఊహాగానాలు
  • కోమాలోకి వెళ్లారంటున్న దక్షిణ కొరియా అధికారి
  • త్వరలోనే కిమ్ యో జోంగ్ రాజ్యాధికారం చేపడతారంటున్న జర్నలిస్టు
North Korea Dictator Kim Has been Died says A Journalist

ఉత్తర కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్ సహాయకుడు చాంగ్ సాంగ్ మిన్ చేసిన వ్యాఖ్యలపై ఓ జర్నలిస్టు స్పందించారు. ఉత్తర కొరియాలో పర్యటించిన ప్రముఖ జర్నలిస్టు రాయ్ కేలీ తాజాగా మాట్లాడుతూ.. కిమ్ కోమాలో లేరని, ఆయన చనిపోయారని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనమయ్యాయి. త్వరలోనే ఆయన సోదరి కిమ్ యో జోంగ్ రాజ్యాధికారం చేపట్టబోతున్నారని ఆయన పేర్కొన్నారు.

నిజానికి కిమ్‌ ఆరోగ్య పరిస్థితి దిగజారినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మెదడుకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందన్న వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆయన గత కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించకపోవడం ఇందుకు మరింత ఊతమిచ్చింది. దీంతో స్పందించిన నార్త్ కొరియా.. కిమ్ ఓ అధికారిక కార్యక్రమానికి హాజరైన వీడియోను విడుదల చేసి పుకార్లకు తెరదించే ప్రయత్నం చేసినా ఆ వీడియోపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రాయ్ కేలీ మాట్లాడుతూ.. కిమ్ చనిపోయారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో జరుగుతున్న కార్యాచరణ పరమైన మార్పులు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రజలకు విడుదల చేస్తున్న సమాచారం గందరగోళంగా ఉందని, దీంతో దేశంలో ఏదో జరగబోతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.

అంతేకాదు, నార్త్ కొరియా రెండో సుప్రీం లీడర్‌గా వ్యవహరించిన కిమ్ జోంగ్ ఇల్ చనిపోయిన విషయాన్ని కూడా అప్పట్లో ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా కేలీ గుర్తు చేశారు. కిమ్ సోదరి కనుక అధికార పగ్గాలు స్వీకరిస్తే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని కేలీ పేర్కొన్నారు.

More Telugu News