Venkatesh: 'ఎఫ్ 2' సీక్వెల్ పై స్పష్టత నిచ్చిన వెంకటేశ్!

Venkatesh to join shoots next year only
  • ప్రభుత్వం ఓకే చెప్పినా మొదలవ్వని షూటింగులు 
  • కరోనాకు జంకుతున్న పెద్ద హీరోలు 
  • ఈ ఏడాది షూటింగులు కేన్సిల్ చేసిన వెంకీ
  • సంక్రాంతి తర్వాతే 'ఎఫ్ 2' సీక్వెల్ షూటింగ్
కొవిడ్ నిబంధనలతో షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, పెద్ద హీరోలు మాత్రం సెట్స్ కి రావడానికి జంకుతూనే వున్నారు. కరోనా మహమ్మారి ఏ రూపంలో వచ్చి అంటుకుంటుందో అన్న భయంతో షూటింగులను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు వెంకటేశ్ కూడా ఇప్పట్లో షూటింగులకు వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.

ఆయన నటిస్తున్న 'నారప్ప' చిత్రం షూటింగ్ చాలావరకు లాక్ డౌన్ కి ముందు అవుట్ డోర్ లో జరిగింది. అయితే, లాక్ డౌన్ రావడంతో ఎక్కడి షూటింగ్ అక్కడ ఆగిపోయింది. ఇక ఇప్పట్లో ఈ చిత్రం షూటింగును ప్రారంభించడానికి వెంకటేశ్ సంసిద్దంగా లేరని తెలుస్తోంది. అసలు ఈ ఏడాది చివరి వరకు సెట్స్ కి వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకుని, యూనిట్ కి ఆ విషయం చెప్పేశారని కూడా అంటున్నారు. దీంతో, వెంకీ, వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి రూపొందించే 'ఎఫ్ 2' సీక్వెల్ షూటింగ్ కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి తర్వాత షూటింగ్ షెడ్యూల్స్ వేసుకోమని వెంకీ దర్శకుడు అనిల్ కి చెప్పారట.    
Venkatesh
Anil Ravipudi
F2

More Telugu News