Jagan: అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి: సీఎం జగన్

CM Jagan held a review meeting on anti corruption measures and system
  • అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ సమీక్ష
  • 1902 నెంబర్ ను ఏసీబీకి అనుసంధానం చేయాలన్న జగన్
  • అవినీతిపరులకు త్వరగా శిక్ష పడాలంటూ వ్యాఖ్య
సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అవినీతి నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని రూపొందించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణ మొదలవ్వాలని స్పష్టం చేశారు. 1902 నెంబర్ ను ఏసీబీకి, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేయాలని, అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని అన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు.

ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారాలను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. 14400 నెంబర్ పై మరింత ప్రచారం నిర్వహించాలని, అవినీతి వ్యవహారాలతో పక్కా ఆధారాలతో దొరికిపోతే వారిపై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ కాలం పట్టకూడదని పేర్కొన్నారు. అవినీతిపరులకు నిర్దిష్ట కాలావధిలో శిక్ష పడేందుకు తగిన చట్టం తీసుకువస్తామని, అసెంబ్లీలో ఈ చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని సూచించారు.
Jagan
Anti Corruption
Review
Meeting
YSRCP
Andhra Pradesh

More Telugu News