Rachakonda Police: సోషల్ మీడియాలో పోస్టు చేసే ప్రతిదీ నిజం కాదు... రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

  • పెరిగిపోతున్న ఫేక్ న్యూస్
  • అనేక జీవితాలపై ఫేక్ న్యూస్ ప్రభావం
  • ఫేక్ న్యూస్ పై  రాచకొండ కమిషనరేట్ పోరుబాట
Rachakonda police fights against fake news

సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, అదే స్థాయిలో దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫేక్ న్యూస్ అంశం సోషల్ మీడియాలో ఓ విపత్తులా పరిణమించింది. కొన్నిసార్లు ఫేక్ న్యూస్ వల్ల ఏది నిజం, ఏది అబద్ధం అని తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని జీవితాలు సైతం ఫేక్ న్యూస్ కారణంగా తీవ్ర ప్రభావాలకు లోనైన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలోని రాచకొండ కమిషనరేట్ పోలీసులు వినూత్న తరహాలో ప్రచారం ప్రారంభించారు.

ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు కొన్నివీడియోల సాయంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్టు నిజమే అని నమ్మవద్దు అని హితవు పలుకుతూ, రాచకొండ పోలీసులు తాజాగా ఓ వీడియో పోస్టు చేశారు.

అందులో రైలు పట్టాలపై సింహం పడుకుని ఉండగా, వేగంగా రైలు వస్తూంటుంది. చూసేవాళ్లకు ఆ రైలు సింహాన్ని తాకుతుంది అనిపించినా, అది గ్రాఫిక్స్ కావడంతో రైలు దానిపాటికి అది వెళ్లిపోతుంది. సింహం రైలు పట్టాలపై ఉన్నట్టు భ్రమించడానికి కారణం గ్రాఫిక్స్ అని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఫేక్ న్యూస్ కూడా ఇలాగే తయారుచేస్తారని, అదే నిజమని అనుకోరాదని రాచకొండ పోలీసులు వివరించారు.


More Telugu News