Narendra Modi: ప్రధాని నివాసంలో నెమళ్లు.. స్వయంగా ఆహారం తినిపించిన మోదీ... చిత్రాలు వైరల్!

Narendra Modi With Peacocks Pics Viral
  • మోదీ ఇంటి ఆవరణలో పక్షుల కోసం ఏర్పాట్లు
  • పురివిప్పి నాట్యం చేసిన నెమలి
  • వైరల్ అవుతున్న వీడియో
తన నివాసంలో నెమళ్లను పెంచుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, వాటి ఆలనా, పాలనా చూస్తూ, వాటికి ఆహారాన్ని తినిపిస్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మార్నింగ్ వాక్ సమయంలో నెమళ్లను జాగ్రత్తగా చూసుకుంటూ, వాటికి ఆహారాన్ని తినిపిస్తుండటం, నెమళ్లు సైతం, మోదీని చూసి దగ్గరకు వచ్చి, ఆయన పెడుతున్న ఆహారాన్ని తింటూ ఉండటం వంటి దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఓ నెమలైతే, మోదీని చూసి, పురివిప్పి ఆడింది కూడా. పర్యావరణంపై ఎంతో మక్కువను చూపించే మోదీ, ఇప్పటికే రెండు పుస్తకాలను కూడా రాశారు. తన ఇంటి ఆవరణలో పక్షులు నివాసం ఉండేందుకు అవసరమైన గూళ్లను కట్టుకునే ఏర్పాట్లు కూడా చేయించారు.
Narendra Modi
Peacock
House
Viral Videos

More Telugu News