KL Rahul: బాలీవుడ్ నటి అథియాశెట్టితో కేఎల్ రాహుల్‌ ప్రేమాయణం.. ఎమోజీ పోస్టు చేసి క్లారిటీ ఇచ్చిన క్రికెటర్!

On Athiyas Birthday Post For Mom Mana Shetty KL Rahul Left This Comment
  • తల్లి బర్త్‌డేను పురస్కరించుకుని ఫొటో షేర్ చేసిన అథియా
  • లవ్ సింబల్ ఎమోజీ పోస్టు చేసిన రాహుల్
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న అభిమానులు
బాలీవుడ్ నటి అథియా శెట్టితో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరింది. లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేసిన రాహుల్ తమ మధ్య ఉన్న బంధాన్ని ఇలా బయటపెట్టాడు. తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని అథియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తల్లిని ఆప్యాయంగా హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసింది. తన తల్లికి ఏ పదాలు సరితూగవని, ఐలవ్యూ అమ్మా అని దానికి క్యాప్షన్ తగిలించింది.

అథియా పోస్టుకు రాహుల్ స్పందించాడు. లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేసి పజిల్ విప్పేశాడు. తాను కూడా ప్రేమిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఇది చూసిన అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నిజానికి రాహుల్, అథియాలు ప్రేమించుకుంటున్నట్టు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో రాహుల్ బర్త్‌డేను పురస్కరించుకుని అథియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దానికి ‘మై పర్సన్’ అని క్యాప్షన్ తగిలించింది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి రాహుల్ తన తాజా కామెంట్‌తో మరింత బలం చేకూర్చినట్టు అభిమానులు తమ కామెంట్ల ద్వారా స్పష్టత ఇస్తున్నారు.
KL Rahul
Bollywood
Athiya Shetty
Love

More Telugu News