sai tej: మెగా కుటుంబంలో మరో హీరోకి పెళ్లి.. సారీ ప్రభాస్‌ అన్న అంటూ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన సాయితేజ్

sai tej shares interesting video
  • టాలీవుడ్ యంగ్‌ హీరోలకి వరుసగా పెళ్లిళ్లు 
  • రేపు ఉదయం 10 గంటలకు ఓ ప్రకటన చేస్తానన్న సాయితేజ్‌
  • పెళ్లి కాని హీరోల జాబితాలో ప్రభాస్‌ను ఒంటరి చేస్తోన్న సాయి తేజ్
  • సింగిల్‌ ఆర్మీ నుంచి లెఫ్ట్ అవుతున్నట్లు వీడియో
టాలీవుడ్ యంగ్‌ హీరోలకి వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మొదట నిఖిల్‌ పెళ్లి చేసుకున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్‌ బై చెప్పాడు. ఆ తర్వాత నితిన్‌కి పెళ్లి అయిపోయింది. సింగిల్‌ లైఫ్‌కి టాటా చెప్పేసి ఇంటివాడయ్యాడు. ఆ తర్వాత రానా కూడా అదే దారిలో పయనించాడు. ఇప్పుడు మెగా హీరో సాయి తేజ్ వంతు వచ్చేసింది.

టాలీవుడ్‌లో పెళ్లి కాని హీరోల జాబితాలో ప్రభాస్‌ను ఒంటరి చేసి సాయి తేజ్‌ కూడా సారీ చెప్పేసి బ్యాచిలర్ లైఫ్‌ నుంచి లెఫ్ట్‌ అయిపోతున్నాడు. ప్రస్తుతం 'సోలో బతుకే సో బెటరు' సినిమాలో నటిస్తోన్న సాయి తేజ్ నిజ జీవితంలో మాత్రం ఆ బతుకుకి టాటా చెప్పేయనున్నట్లు స్పష్టమైపోయింది.

తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను రేపు ఉదయం 10 గంటలకు చేస్తానంటూ ఈ కుర్ర హీరో ఓ క్లూ ఇస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
sai tej
Tollywood
Twitter
Viral Videos

More Telugu News