గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. అర్ధరాత్రి కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్

23-08-2020 Sun 10:20
  • 6 కిలోమీటర్ల పొడవున రూ. 2 వేల కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం
  • అర్ధ రాత్రి కావడంతో తప్పిన పెను ప్రమాదం
  • కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ
Portion Of 6 Km Long Flyover Under Construction Collapses In Gurgaon
హర్యానాలోని గురుగ్రామ్‌లో గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ప్లై ఓవర్‌లోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అర్ధరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన అధికారులు, శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు.

రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6 కిలోమీటర్ల పొడవున రూ. 2 వేల కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్‌ ఎలివేటెడ్ రోడ్డు‌లోని కొంత భాగం కూలిపోయింద‌ని ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ తెలిపారు.