Ranjan Gogoi: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తే అసోం బీజేపీ సీఎం అభ్యర్థి: కాంగ్రెస్ విమర్శలు

  • అయోధ్య కేసులో తీర్పునకు ప్రతిఫలం
  • రాజ్యసభ నామినేషన్‌కు అంగీకరించడంతో ఆయన ఆకాంక్ష అర్థమైంది
  • నేనైతే సీఎం అభ్యర్థిని కాను: తరుణ్ గొగోయ్
Ranjan Gogoi may be BJPs assam CM Candidate

వచ్చే ఏడాది అసోంలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ అన్నారు. బీజేపీ జాబితాలో ఆయన పేరు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. రంజన్ గొగోయ్ కనుక రాజ్యసభకు వెళ్తే, అసోం ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అవుతారని అన్నారు. అయోధ్య కేసులో ఆయన ఇచ్చిన తీర్పుపై బీజేపీ సంతోషంగా ఉందన్నారు. అందుకనే ఆయనను ఈ పోస్టులో కూర్చోబెట్టాలని చూస్తోందన్నారు.

ఇదంతా రాజకీయమని, గొగోయ్  రాజ్యసభ నామినేషన్‌కు అంగీకరించడంతో ఆయన క్రమంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారన్న సంగతి అర్థమైందన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని రంజన్ ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. ఆయన చాలా సులభంగా మానవ హక్కుల సంఘానికో, మరో దానికో చైర్మన్ అవుతారని తరుణ్ గొగోయ్ ఆరోపించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష ఉండబట్టే రాజ్యసభ నామినేషన్‌కు ఆయన అంగీకరించారని మాజీ సీఎం ఆరోపించారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని తరుణ్ గొగోయ్ స్పష్టం చేశారు.

More Telugu News