Allu Arjun: అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ షెడ్యూల్ అప్ డేట్స్

Allu Arjuns latest film Pushpa shooting schedule planned from November
  • సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప'
  • కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • నవంబర్ లో షెడ్యూల్ ప్రారంభం
  • మహబూబ్ నగర్ అడవుల్లో చిత్రీకరణకు ప్లాన్
'అల వైకుంఠపురములో' చిత్రం విజయం ఇచ్చిన ఉత్సాహంతో హీరో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంగా 'పుష్ప'ను ప్రారంభించాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొన్నాళ్లు జరగగానే కరోనా మహమ్మరి పంజా విసరడంతో షూటింగు ఆగిపోయింది. ఇక ఇప్పుడు మెల్లగా అందరూ షూటింగులకు షెడ్యూల్స్ వేసుకుంటూ ఉండడంతో, పుష్ప షూటింగ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో కరోనా తగ్గుముఖం పడుతుందన్న అంచనాతో నవంబర్ నుంచి ఈ చిత్రం షూటింగు నిర్వహించాలని నిర్ణయించారట.

ఇక ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో రూపొందుతుండడం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ఎక్కువగా హీరోకి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తారట. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మరోపక్క, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం ఇప్పటికే కొన్ని బాణీలను సిద్ధం చేసేశాడట.
Allu Arjun
Sukumar
Rashmika Mandanna
Pushpa

More Telugu News