జో బైడెన్-కమలా హారిస్ జోడీ గెలుపు కోసం ముందుకు కదిలిన అమెరికన్ భారతీయ సమాజం
- అమెరికా ఉపాధ్యక్ష పదవి బరిలో కమలా హారిస్
- భారతీయ సమాజం ఓట్లపై గురిపెట్టిన జో బైడెన్
- సంగీతభరిత వీడియోతో ప్రచారం చేస్తున్న భుటోరియా దంపతులు
వినీతా భుటోరియా, అజయ్ భుటోరియా అనే దంపతులు కమలా హారిస్-జో బైడెన్ జోడీని భారతీయ అమెరికన్లు గెలిపించాలంటూ ఓ సంగీత భరితమైన వీడియోతో ప్రచారం చేస్తున్నారు. ఏది సరైనదో అది సాధించుకునేందుకు అమెరికన్ భారతీయ సమాజం అంతా కదిలిరావాలని వినీతా భుటోరియా పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి... జో బైడెన్ లా ఉండాలి అంటూ తమదైన శైలిలో ఆ జంట ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తోంది.