KTR: భూమి ఇచ్చే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి: కేటీఆర్

  • ప్రపంచంలోనే పెద్ద ఫార్మా క్లస్టర్ గా ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటోంది
  • స్థానికుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి
  • వారి విద్యార్హతలను మ్యాపింగ్ చేయండి
 Every family that gives land should be given a job says KTR

స్థానికుల సహకారంతో ఫార్మాసిటీ పనులు వేగంగా ముందుకెళ్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా హైదరాబాద్ ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రగతిభవన్ లో ఫార్మాసిటీపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్థానికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా సిటీ కోసం భూములు ఇస్తున్న ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించాలని సూచించారు. ప్రభావిత కుటుంబాలకు సంబంధించి ఒక జాబితా తయారు చేయాలని... కుటుంబసభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలను మ్యాపింగ్ చేయాలని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో పాటు, ఇతర శిక్షణా సంస్థల సహకారంతో ముందుకు పోవాలని చెప్పారు.

More Telugu News