CBI: సుశాంత్ మరణంపై దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ

  • సుశాంత్ వంటవాడు నీరజ్ ను ప్రశ్నించిన సీబీఐ సిట్
  • ఫ్లాట్ లో ఉంటున్న సిద్ధార్థ్ పితానిపైనా ప్రశ్నల వర్షం
  • మార్చురీలోకి రియా ఎలా వెళ్లిందన్న దానిపైనా ఆరా
SIT of CBI speeds up investigation in Sushant case

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబయిలో తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మృతికి దారితీసిన కారణాల అన్వేషణకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీబీఐ కూడా ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వేగం పెంచింది. తాజాగా, సుశాంత్ ఇంటి వంటవాడు నీరజ్ సింగ్ ను విచారించింది. శాంటాక్రజ్ లోని ఓ గెస్ట్ హౌస్ లో నీరజ్ పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.  

అధికారులు సుశాంత్ తో పాటు ఫ్లాట్ లో ఉంటున్న సిద్ధార్థ్ పితానిని కూడా ప్రశ్నించారు. వారిరువురి నుంచి సమాచారం రాబట్టారు.  అనంతరం, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న బాంద్రా ఫ్లాట్ ను సీబీఐ అధికారులు సందర్శించారు. అంతేకాదు, వారు ముంబయిలోని కూపర్ ఆసుపత్రికి వెళ్లారు. సుశాంత్ మృతదేహాన్ని ఉంచిన మార్చురీలో రియా చక్రవర్తి అధికారిక అనుమతి లేకుండానే 45 నిమిషాల సేపు ఎలా గడిపిందన్న విషయాన్ని కూడా నిగ్గు తేల్చే ప్రయత్నం చేశారు.

More Telugu News