Pranab Mukherjee: ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు: ఆర్మీ ఆసుపత్రి

Pranabs health condition remains same says Army Hospital
  • వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నాం
  • ఇతర శరీర అవయవాలు బాగున్నాయి
  • నిపుణుల బృందం పర్యవేక్షిస్తోంది
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో ఆయన బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ కూడా జరిగింది. ప్రణబ్ ఆరోగ్యానికి సంబంధించి ఆర్మీ ఆసుపత్రి నేడు బులెటిన్ విడుదల చేసింది.

ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పైనే ఉంచి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఒక నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇతర శరీర అవయవాలు బాగానే ఉన్నాయని చెప్పారు. మరోవైపు ప్రణబ్ దాదా త్వరగా కోలుకోవాలని ప్రజలంతా ప్రార్థిస్తున్నారు.
Pranab Mukherjee
Corona Virus
Health Bulletin

More Telugu News