Schedule: తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదల

  • ఈ నెలాఖరు నుంచి తెలంగాణలో ఎంట్రన్సుల సందడి
  • ఆగస్టు 31న ఈసెట్
  • అక్టోబరు 4న లాసెట్
Telangana common entrance tests schedule released

ఓవైపు కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలోనూ, విద్యార్థులు నష్టపోరాదన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కామన్ ఎంట్రన్స్ టెస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ జరపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా పేర్కొన్న షెడ్యూల్ లో ఈసెట్ నుంచి ఎంసెట్ వరకు అన్ని పరీక్షల తేదీలు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన చేసింది.

ఈ సెట్- ఆగస్టు 31
ఎంసెట్ (ఇంజినీరింగ్)- సెప్టెంబరు 9, 10, 11, 14
ఎంసెట్ (అగ్రికల్చర్)- సెప్టెంబరు 28, 29
పీజీ ఈసెట్- సెప్టెంబరు 21 నుంచి 24 వరకు
ఐసెట్- సెప్టెంబరు 30, అక్టోబరు 1
ఎడ్ సెట్-అక్టోబరు 1, 3
లాసెట్- అక్టోబరు 4

More Telugu News