Hyderabad: పూజలందుకుంటోన్న 9 అడుగుల ఖైరతాబాద్‌ గణేశుడు!

  • కరోనా కారణంగా నిరాడంబరంగా వేడుకలు
  • కరోనాకు ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణుడిగా గణేశుడు
  • వినాయకుడి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకం
khairatabad ganesh 9 feets only

దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలు కరోనా కారణంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ సారి ఎత్తయిన విగ్రహాలు దర్శనమివ్వడం లేదు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు.
                               
ఇక ప్రతి ఏడాది అత్యంత ఎత్తయిన గణనాథుడి విగ్రహం దర్శనమిచ్చే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఈ సారి 9 అడుగుల వినాయక విగ్రహం మాత్రమే కనపడుతోంది. కరోనాకు ఔషధం తీసుకొచ్చే ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు గణేశుడు దర్శనిమిస్తూ పూజలందుకుంటున్నాడు.
        
వినాయకుడి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకం ఉన్నాయి. ఆయనకు కుడివైపున మహాలక్ష్మీ, ఎడమవైపున సరస్వతి ఉన్నారు. కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో భక్తులకు నేరుగా అనుమతి ఉండదు. www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

More Telugu News