Fatwa: టీవీ చూసినా, క్యారమ్స్ ఆడినా జరిమానా తప్పదు: పశ్చిమ బెంగాల్ లోని గ్రామ కమిటీ ఫత్వా

Fatwa issued against watching TV music playing carrom in West Bengals Murshidabad
  • పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో జారీ అయిన ఫత్వా
  • తప్పును బట్టి జరిమానా, భౌతిక శిక్షలు
  • ఏ తప్పునకు ఎంత జరిమానా విధించేదీ తెలిపేలా బ్యానర్ల ఏర్పాటు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం ప్రాబల్య గ్రామ కమిటీ సంచలన ఫత్వా జారీ చేసింది. గ్రామంలో ఎవరైనా టీవీ చూసినా, క్యారమ్స్ ఆడినా, మద్యం, లాటరీ టికెట్లు కొన్నా, మ్యూజిక్ విన్నా జరిమానా తప్పదంటూ ఫత్వాలో హెచ్చరించింది. ఈ మేరకు గ్రామ సామాజిక సంస్కరణల కమిటీ గ్రామంలో ఈ నెల 9న బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా చేసిన తప్పుకు రూ. 500 నుంచి రూ. 7 వేలకు జరిమానాలు విధించనున్నట్టు తెలిపింది. దీంతో పాటు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం, శిరోముండనం వంటి శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఏ తప్పునకు ఎంత జరిమానా అంటే..

* టీవీ చూడడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్‌లలో మ్యూజిక్ వింటే రూ. 1,000 జరిమానా
* కేరమ్స్ ఆడితే రూ. 500
* లాటరీ టికెట్ కొంటే రూ. 2 వేలు
* మద్యం అమ్మితే రూ. 7 వేల జరిమానాతోపాటు శిరోముండనం చేసి గ్రామంలో ఊరేగింపు
* లాటరీ టికెట్లు విక్రయిస్తే రూ. 7 వేలు
* మద్యం తాగితే 2 వేల జరిమానా, చెవులు పట్టుకుని పది గుంజీలు
* గంజాయి కొంటే రూ. 7 వేలు

నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించిన సమాచారం అందిస్తే తప్పును బట్టి రూ. 200 నుంచి రూ. 2 వేల వరకు నజరానా ఇస్తామని గ్రామ కమిటీ ప్రకటించింది.
Fatwa
West Bengal
Murshidabad
Muslim village

More Telugu News