Tapsee: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Tapsee in and as Rashmi Rocket
  • తాప్సీ కథానాయికగా 'రష్మి రాకెట్'
  • రమేశ్ వర్మ దర్శకత్వంలో హిందీలో 'రాక్షసుడు'
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులలో 'దేవినేని' సినిమా
*  గత కొంత కాలంగా హిందీ సినిమాలు చేస్తున్న కథానాయిక తాప్సీ తాజాగా మరో హిందీ చిత్రానికి ఓకే చెప్పింది. 'రష్మి రాకెట్' పేరుతో ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. దీనికి ఆకాశ్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ఆమధ్య రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా 'రాక్షసుడు' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని 'రాక్షసుడు' నిర్మాత కోనేరు సత్యనారాయణ హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి కూడా రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తాడు. ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ లలో ఒకరు హీరోగా నటిస్తారట.
*  నర్రా శివనాగు దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవినేని' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేశ్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటించారు. పోలీస్ ఆఫీసర్ కేఎస్ వ్యాస్ పాత్రలో సంగీత దర్శకుడు కోటి నటించారు.  
Tapsee
Bellamkonda Srinivas
Anupama Parameshvaran
Tarakaratna

More Telugu News