Bollywood: ఇప్పుడు అక్షయ్ కుమార్ వంతు.. బేర్‌గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేసిన బాలీవుడ్ యాక్షన్ హీరో!

Bollywood Actor Akshay Kumar went into wild with Beargylls
  • ఇన్‌స్టాగ్రామ్‌లో టీజర్ విడుదల చేసిన అక్షయ్ కుమార్
  • పిచ్చోళ్లే అడవిలోకి వెళ్తారని క్యాప్షన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీజర్

బేర్ గ్రిల్స్.. పరిచయం అక్కర్లేని పేరిది. డిస్కవరీ చానల్‌లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరుతో అతడు చేసే సాహసాలు చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంటాయి. బేర్‌తో కలిసి సాహసాలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఆసక్తి చూపుతుంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి వారు ఇప్పటికే అతడితో కలిసి అడవుల్లో సాహసాలు చేశారు.

ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వంతు వచ్చింది. వచ్చే నెల 11న డిస్కవరీ ప్లస్ యాప్‌లో, 14న డిస్కవరీ చానల్‌లో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మీరు నన్ను పిచ్చోడనుకుంటున్నారా? పిచ్చోళ్లే అడవిలోకి వెళ్తారు’’ అని దానికి క్యాప్షన్ తగిలించాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దీనిని 60 లక్షల మందికిపైగా వీక్షించారు.

  • Loading...

More Telugu News