JEE: షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్... ఇప్పటికే హాల్ టికెట్ల జారీ!

Centre says JEE and NEET will be held as per schedule
  • పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థులు
  • విద్యార్థుల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ (మెయిన్)
  • సెప్టెంబరు 13న నీట్
జాతీయస్థాయిలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన జేఈఈ (మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్ లను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో కేంద్రం తన వైఖరి వెల్లడించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఇప్పటికే జేఈఈ (మెయిన్) అభ్యర్థులకు చెందిన హాల్ టికెట్లను జారీ చేసిందని, 6.5 లక్షల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. కాగా, జేఈఈ (మెయిన్) సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ మధ్య, నీట్ సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు.
JEE
NEET
NTA
Supreme Court
Corona Virus
India

More Telugu News