Pawan Kalyan: శ్రీశైలం పవర్ హౌస్ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan responds to Srisailam power house fire accident
  • శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం
  • 9 మంది మృతి
  • బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న పవన్
తెలంగాణ రాష్ట్ర పరిధిలో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరం అంటూ విచారం వెలిబుచ్చారు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగానూ, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తన సందేశంలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Srisailam
Power House
Fire Accident
Janasena

More Telugu News