Vallabhaneni Vamsi: రామ్... నీ సినిమాలు ఆ ఒక్క సామాజిక వర్గం వాళ్లే చూస్తారా?: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi slams Tollywood Hero Ram
  • స్వర్ణ ప్యాలెస్ నేపథ్యంలో ఇటీవల రామ్ వ్యాఖ్యలు
  • రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడన్న వంశీ
  • చంద్రబాబు పైనా విమర్శలు చేసిన వంశీ
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై టాలీవుడ్ యువ హీరో రామ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారంలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని విమర్శించారు. రామ్ సినిమాలు కేవలం అతని సామాజిక వర్గం వాళ్లే చూస్తారా? అని ప్రశ్నించారు. వేరే సామాజిక వర్గం వాళ్లు చూడరా? చేతనైతే వేరే సామాజిక వర్గం వాళ్లను తన సినిమాలు చూడొద్దని రామ్ చెప్పగలడా? అని నిలదీశారు.

ఇటీవల రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, కులం అనే జబ్బు కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని, కరోనా కంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించాడు. నిశ్శబ్దంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని పేర్కొన్నాడు.

ఇదే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా వంశీ విమర్శలు గుప్పించాడు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదని, గతంలో చాలామంది నాయకులు తమ వర్గం కోసం పనిచేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే ప్రమాదం ఉందని, చంద్రబాబు తనకున్న సమస్యలన్నింటినీ కులంపై రుద్దుతాడని విమర్శించారు.
Vallabhaneni Vamsi
Hero Ram
Swarna Palace Hotel
Ramesh Hospitals
Vijayawada

More Telugu News