చంద్రబాబు గారూ, మీరు చేసిన ట్వీట్ నిస్సిగ్గుగా చేసిన దాడి: సంచయిత

21-08-2020 Fri 16:43
  • నిన్న మాన్సాస్ ట్రస్టుపై వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
  • క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన సంచయిత
  • లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్
Mansas Trust chair person Sanchaita fires on Chandrababu comments
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలకు సంబంధించి నిన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు ఎక్కుపెట్టగా.. ఆ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి తాజాగా తీవ్రస్థాయిలో స్పందించారు. క్షమాపణ చెప్పకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరించారు.

చంద్రబాబు గారూ, మీరు చేసిన ట్వీట్ నిస్సిగ్గుగా చేసిన దాడి అంటూ పేర్కొన్నారు. మాన్సాస్ లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించాలనుకోవడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించినట్టు ఈవో, కరస్పాండెంట్లు వివరించారని, అయినాగానీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని సంచయిత ఆగ్రహం వ్యక్తం చేశారు.