Mohan Babu: స్వయంగా వినాయకుడి కథ చెప్పి వీడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు

  • రేపు వినాయకచవితి
  • తనకు బాగా ఇష్టమైన పండుగ ఇదేనన్న మోహన్ బాబు
  • విష్ణు సూచన పాటించి వీడియో రూపొందించానని వెల్లడి
Mohan Babu explains Lord Ganesha story with his voice

రేపు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మోహన్ బాబు తన గొంతుకతో వినిపించిన వినాయక చవితి కథను వినవచ్చు. ఈ సందర్భంగా మోహన్ బాబు స్పందిస్తూ, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ వినాయకచవితి అని తెలిపారు.

 ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో పాటు కొందరు మిత్రులను కూడా ఇంటికి పిలిచి వినాయక చవితి మంత్రాలు, విఘ్వేశ్వరుడి కథ వినిపించడం తనకు అలవాటు అని, ఆ అలవాటును అందరికీ వినిపించాలని తన పెద్ద కుమారుడు విష్ణు సూచించాడని మోహన్ బాబు వెల్లడించారు. అందుకే ఓ వీడియోలో వినాయకుడి కథ చెప్పి, దాన్ని అందరికీ వినిపిస్తున్నానని వివరించారు. ఈ వీడియోను మంచు విష్ణు తన యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News