విజయసాయితో కలిసి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గవర్నర్ వద్దకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది: వర్ల రామయ్య

21-08-2020 Fri 15:51
  • ఈ మధ్యాహ్నం గవర్నర్ ను కలిసిన విజయసాయి
  • ఏ2 ముద్దాయి అంటూ వర్ల విమర్శలు
  • ఈ జంట గవర్నర్ ను ఎందుకు కలిసిందో చెప్పాలంటూ ట్వీట్
Varla Ramaiah responds after Vijayasai met AP Governor

కొద్దిసేపటి క్రితమే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. పలు కేసుల్లో ముద్దాయిగా, సీబీఐతో చార్జిషీట్ లు వేయించుకుని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ఏ2 విజయసాయిరెడ్డి అని విమర్శించారు. అలాంటి వ్యక్తితో కలిసి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ వద్దకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ జంట గవర్నర్ ను ఎందుకు కలిశారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.