AE Sundar: శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంలో ఏఈ సుందర్, మరో ఐదుగురి మృతదేహాలు లభ్యం

AE Sundar and five more dead in Srisailam power house fire accident
  • శ్రీశైలం పవర్ హౌస్ లో ప్రమాదం
  • లోపలే చిక్కుకుపోయిన 9 మంది
  • మరో ముగ్గురి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గతరాత్రి భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్యానల్ బోర్డులో చెలరేగిన మంటలు జలవిద్యుత్ కేంద్రంలోని పలు యూనిట్లను కబళించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 15 మంది ఓ టన్నెల్ ద్వారా సురక్షితంగా వెలుపలికి వచ్చేశారు.

మిగిలిన 15 మందిలో ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. లోపలే చిక్కుకుపోయిన 9 మందిలో ఒకరి మృతదేహాన్ని ఈ మధ్యాహ్నం కనుగొన్నారు. ఆ మృతదేహం ఏఈ సుందర్ నాయక్ ది అని గుర్తించారు. తాజాగా మరో ఐదు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇంకా మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలం మృతుల రోదనలతో కన్నీటిసంద్రాన్ని తలపిస్తోంది.
AE Sundar
Death
Srisailam Power House
Fire Accident
Andhra Pradesh

More Telugu News