Rama Prabha: ఎస్పీ బాలు అనారోగ్యంపై భావోద్వేగానికి గురైన రమాప్రభ.. వీడియో ఇదిగో!

Rama Prabha gets emotional while talking about SP Balu
  • బాలు త్వరగా మన మధ్యకు రావాలి
  • మన ప్రార్థనలు ఫలిస్తాయి
  • బాలు గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి జీవితంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రోజులు గడుస్తున్నా ఆయన ఆరోగ్యంలో పురోగతి లేకపోవడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అలనాటి నటి రమాప్రభ స్పందిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. బాలు త్వరగా కోలుకుని మనందరి మధ్యకు రావాలని ఆకాంక్షించారు. మనందరి ప్రార్థనలు కచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయని చెప్పారు. బాలు గురించి మాట్లాడటం కూడా ఎంతో బాధను కలిగిస్తోందని అన్నారు.
Rama Prabha
SP Balu
Tollywood

More Telugu News