Chiranjeevi: వెబ్ సిరీస్ లో నటిస్తున్న చిరంజీవి?

Chiranjeevi acting in Web Series in his daughters production
  • రేపు చిరంజీవి పుట్టినరోజు
  • సీఎంపీని విడుదల చేయనున్న సూపర్ స్టార్లు
  • తన కూతురు సుస్మిత వెబ్ సిరీస్ లో చిరు నటిస్తున్నట్టు సమాచారం
మెగాస్టార్ చిరంజీవి ఈనెల 22న పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ భాషలకు చెందిన సినీ సూపర్ స్టార్లు కామన్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఇదే సమయంలో చిరు తాజా చిత్రం 'ఆచార్య' ఫస్ట్ లుక్ కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా... కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని సమాచారం. మరోవైపు, ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. తన కుమార్తె సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో చిరు నటించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన క్లారిటీ కూడా రేపు రానున్నట్టు సమాచారం.
Chiranjeevi
Web Series
Tollywood

More Telugu News