sai tej: ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన మెగా హీరో సాయి తేజ్

  • సంకల్ప బలాన్ని తెలుపుతోన్న వీడియో
  • రెండు బల్లల మధ్య సందు
  • దాన్ని దాటుకుని వెళ్లిన పురుగు  
  • సంకల్ప బలం ఉంటే విజయానికి దారి ఉంటుందని నిరూపణ
sai tej shares interesting video

టాలీవుడ్‌ హీరో సాయి‌ తేజ్‌ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. ఓ పురుగు ముందుకు వెళ్తూ, మధ్యలో వచ్చిన అవాంతరాన్ని ఎలా అధిగమించిందన్న విషయాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. మన ముందు దారి లేకపోయినా సమయస్ఫూర్తితో మన లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చో తెలుపుతూ ఆ చిన్న పురుగు సందేశం ఇస్తోంది.

రెండు బల్లల మధ్య ఉన్న సందును ఈ వీడియోలో పురుగు దాటుతుంది. సంకల్ప బలం ఎక్కడ ఉంటుందో అక్కడ మన విజయానికి దారి ఉంటుందని  వండర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఈ వీడియోను పోస్ట్ చేయగా దాన్ని సాయి తేజ్ రీట్వీట్ చేశాడు. ఈ చిన్న జీవిని చూసి ఈ రోజు మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు. మెగాస్టార్‌ కుటుంబం కూడా ఇలాగే సంకల్ప బలంతో ఎదిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News