Zombie Reddy: గద పట్టుకుని వెళ్తున్న హీరో.. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ 'జాంబీ రెడ్డి' స్పెషల్ వీడియో

Zombie Reddys team birthday wishes to megastar Chiranjeevi
  • రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు 
  • జాంబీ రెడ్డి హీరో గద పట్టుకుని వెళ్తున్న దృశ్యం విడుదల
  • అతడి టీ షర్ట్ వెనకాల చిరంజీవి ఫొటో  
మెగాస్టార్ చిరంజీవి రేపు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా 'జాంబీ రెడ్డి' సినీ యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో హీరో వీర హనుమాన్ నాట్యమండలి వద్దకు గద పట్టుకుని వెళ్తుంటాడు. అతడి టీ షర్ట్ వెనకాల చిరంజీవి ఫొటో ఉంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, టాలీవుడ్‌లో  'అ!', 'క‌ల్కి'  వంటి సినిమాలు తీసిన దర్శకుడు  ప్రశాంత్ వర్మ 'జాంబీ రెడ్డి' అనే విభిన్న టైటిల్‌తో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు, చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. రేపు ఈ సినిమా నుంచి వచ్చే కానుక కోసం చిరు అభిమానులు ఎదురు చూస్తున్నారు.                          
                 
Zombie Reddy
Chiranjeevi
Viral Videos

More Telugu News