Passes Away: కరోనాతో సినీ న‌టుడు దిలీప్ ‌కుమార్ తమ్ముడి మృతి

Dilip Kumars Younger Brother Aslam Khan Passes Away
  • ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూత
  • అస్లాంఖాన్ (88)కు బీపీ, షుగ‌ర్, హృద్రోగ స‌మ‌స్య కూడా 
  • శ్వాస‌తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ప‌డ్డ అస్లాం
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్, ఇషాన్ ఖాన్ ‌లకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిద్దరికీ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందింది. అయితే, అస్లాంఖాన్ (88) ఈ రోజు తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు.

ఆయనకు బీపీ, షుగ‌ర్, హృద్రోగ స‌మ‌స్య కూడా ఉండడంతో వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అస్లాంఖాన్‌  శ్వాస‌ తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ప‌డ్డారని, ఆయన శరీరంలో ఆక్సిజన్ స్థాయి 80 శాతం కంటే తక్కువగా నమోదుకావడంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందించామ‌ని అయినప్పటికీ ఆయనను కాపాడలేకపోయామని వైద్యులు చెప్పారు. కాగా, ఇషాన్ ఖాన్ కంటే అస్లాం ఖాన్‌ చిన్న‌వాడు. వారి తల్లిదండ్రులకు మొత్తం 12 మంది సంతానం.
Passes Away
Dilip Kumar
Bollywood

More Telugu News