kgf: 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2' షూటింగ్ మళ్లీ ప్రారంభం.. ఫొటో పోస్ట్ చేసిన దర్శకుడు

kgf shooting begins
  • యశ్‌ హీరోగా సినిమా
  • క‌రోనా వైర‌స్ విజృంభణతో షూటింగు 6 నెల‌ల పాటు బంద్
  • మళ్లీ అనుమ‌తులు ఇచ్చిన నేపథ్యంలో షురూ

యశ్‌ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కన్నడలోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2' రూపొందుతోంది.

ఛాప్టర్‌ 1 భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఛాప్టర్‌ 2పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. క‌రోనా వైర‌స్ విజృంభణతో ఈ సినిమా షూటింగు 6 నెల‌ల పాటు ఆగిపోయింది. షూటింగు‌లకు ప్రభుత్వం మళ్లీ అనుమ‌తులు ఇచ్చిన నేపథ్యంలో నిన్న  'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2' షూటింగ్‌ను ప్రారంభించారు.

ఈ విష‌యాన్ని  తెలుపుతూ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో విలన్‌గా‌ అధీరా పాత్రలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోని ఆయన లుక్‌ను ఈ చిత్ర బృందం ఇటీవలే‌ విడుదల చేసింది.

సంజయ్ దత్‌ ముఖం మీద టాటూలు, సరికొత్త హెయిర్‌ స్టైల్‌, అతడి చేతిలో మారణాయుధంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. అయితే, సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఈ సినిమాలో నటిస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. కేన్సర్ బారిన ప‌డిన సంజ‌య్ ద‌త్ చికిత్స తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News