S Rama Chandra Rao: సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు కన్నుమూత

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడ్వకేట్‌ జనరల్‌గా బాధ్యతలు
  • సీఎంల అవినీతిపై కోర్టులో పోరాడిన న్యాయవాది
  • ఆయన కారణంగా పదవులు కోల్పోయిన ముగ్గురు ముఖ్యమంత్రులు
  • గుట్కాను నిషేధించాలన్న కేసులో వాదనలు జరిపి విజయం
S Rama Chandra Rao Passes away

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడ్వకేట్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు(73) హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గతంలో సీఎంల అవినీతిపై కోర్టులో ఆయన పోరాడడంతో ముగ్గురు ముఖ్యమంత్రులు పదవి కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు 15 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఆయన కోర్టులో పోరాడి విజయం సాధించారు.

మాజీ సీఎం ఎన్టీఆర్‌ కి అల్లుడు కావడం వల్లనే అప్పట్లో చంద్రబాబుకు కర్షక పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారన్న అంశంపై రామచంద్రరావు రెండు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు రూ.25 వేల కోట్లు ధార్మికేతర కార్యక్రమాలకు మళ్లకుండా ఆయన రక్షించారు.

అలాగే గుట్కాను నిషేధించాలన్న కేసులో వాదనలు జరిపి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు తెలంగాణకు ఎలక్ట్రిక్ పవర్‌, నీళ్లు అంశాలపై ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నల్లగొండ జిల్లాలో 1,800 ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు మంచినీరు అందేలా చేశారు. కోడెల శివప్రసాద్ ఇంటి వద్ద బాంబు పేలుళ్ల కేసును సీబీఐకి అప్పగించేలా చేశారు.

  • Loading...

More Telugu News