SPB: ఎస్పీబీకి ఎక్మో సపోర్ట్... ఆరోగ్యం మరింత విషమం!

  • కరోనాతో చికిత్స పొందుతున్న బాలు
  • విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం
  • ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధా భాస్కరన్
SP Baalu Health is Very Criticle

ప్రఖ్యాత గాయకుడు, కరోనా సోకి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింతగా విషమించింది. నిన్నటి వరకూ వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్న ఆయనకు తాజాగా ఎక్మో సపోర్ట్ ను కూడా అమర్చామని హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధా భాస్కరన్ వెల్లడించారు. ఎస్పీ బాలూకు చికిత్స విషయంలో విదేశీ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆయనకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నందునే ఎక్మో మద్దతును అందించాలని వైద్య నిపుణులు భావించారని అన్నారు.

 ఆసుపత్రిలో చేరిన తొలినాళ్లలో సాధారణ చికిత్సను నిర్వహించిన వైద్యులు, ఆపై ఐసీయూకు తరలించి, ఈసీఎంఓ మద్దతుతో చికిత్సను చేస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని, చికిత్సకు స్పందిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, శరీరంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటంతో, ఆయన శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో వెంటిలేటర్ ను అమర్చారు. అది కూడా ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ఇప్పుడు ఎక్మో వ్యవస్థతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని, చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో, అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఆయన కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

More Telugu News