Srisailam: శ్రీశైలం ఎడమ పాతాళగంగ వద్ద భారీ అగ్నిప్రమాదం... పలువురు గల్లంతు!

  • టీఎస్ జెన్ కో అధీనంలో ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం
  • ప్యానల్ సర్క్యూట్ లో మంటలు
  • 9 మంది కోసం కొనసాగుతున్న గాలింపు
Huge Fire Accident in Srisailam Power Plant

తెలంగాణ పరిధిలోని టీఎస్ జెన్ కో అధీనంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు పాతాళగంగ వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరుగగా, పది మంది వరకూ గల్లంతయ్యారు. విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో 17 మంది వరకూ లోపల ఉన్నారని తెలుస్తోంది. ప్యానల్ సర్క్యూట్ లో తొలుత మంటలు చెలరేగాయని అంటున్నారు.

ప్రమాదం తరువాత 8 మంది బయటకు పరుగులు తీయగా, డీఈ శ్రీనివాస్, ఏఈ సుందర్, ఉద్యోగులు మోహన్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, రాంబాబు, కిరణ్ ల కోసం గాలిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకుని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News