జీవీఎల్ పై అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

20-08-2020 Thu 22:09
  • టీడీపీకి చెందిన రామయ్యపై ఫిర్యాదు చేశామన్న బీజేపీ
  • ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపణ
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మంగళగిరి సీఐడీ పోలీసులు
AP BJP complains against a person alleged that he trolled GVL
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఏపీ బీజేపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. టీడీపీకి చెందిన రామయ్య అనే వ్యక్తి జై తెలుగుదేశం, టీడీపీ యూత్ అనే పేర్లతో ఫేస్ బుక్ పేజీలు నిర్వహిస్తున్నాడని, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఏపీ బీజేపీ ఆరోపించింది. తాము ఈ విషయాన్ని మంగళగిరి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా ఏపీ బీజేపీ తన ట్వీట్ కు జోడించింది.