Bird: ఎరను వేసి చేపను పట్టడం ఎలాగో మనిషికే కాదు, ఈ పక్షికి కూడా బాగా తెలుసు!

  • చేపలు పట్టేందుకు ఎరను వేసిన పక్షి 
  • చేప వచ్చేవరకు ఓపిగ్గా వున్న పక్షి
  • చేప రాగానే చటుక్కున పట్టేసిన వైనం
Bird caught a fish using bait like humans

చేపలు పట్టేందుకు ఎరను వేయడం సాధారణమైన విషయం. మానవుడు ఎప్పటినుంచో ఈ పద్ధతిలో చేపల వేట సాగిస్తున్నాడు. అయితే ఓ పక్షి చేపను పట్టేందుకు ఎరను వేయడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆ పక్షి తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నోటితో ఏదో పదార్థాన్ని నీటిలో జారవిడిచిన ఆ పక్షి... చేప ఆ ఆహార పదార్ధానికి దగ్గరగా రాగానే చటుక్కున చేపను దొరకబుచ్చుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. తాను తినడానికి అనువైన చేప వచ్చే వరకు ఆ పక్షి ఓపిగ్గా వ్యవహరించిన తీరు నిజంగా అబ్బురపరుస్తుంది.


More Telugu News