Takao Shito: విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం... డబ్బుకు లొంగని జపాన్ రైతు!

Japan farmer cultivates his land in Narita airport
  • 1970లో నరితా విమానాశ్రయం విస్తరణ ప్రయత్నాలు
  • పరిహారం ఇస్తామన్నా భూమిని ఇవ్వని రైతు
  • రైతుకే మద్దతు పలికిన కోర్టు
జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఉన్న నరితా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ విమానాశ్రయం మధ్యలో ఓ రైతు తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తాడు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా చూసి ఉండరు. ఆ రైతు పేరు టకావో షిటో. అసలు కథలోకి వెళితే.... 70వ దశకం ఆరంభంలో నరితా విమానాశ్రయాన్ని మరింతగా విస్తరించేందుకు జపాన్ ప్రభుత్వం సంకల్పించింది. ఎయిర్ పోర్టు చుట్టుపక్కల భూములకు తగిన పరిహారం అందించి సొంతం చేసుకుంది. కానీ టకావో షిటో తండ్రి మాత్రం తన భూమిని ఇచ్చేందుకు అంగీకరించలేదు.

కొంతకాలానికి తండ్రి చనిపోవడంతో టకావో షిటో ఉద్యోగం మానేసి తండ్రి బాటలో వ్యవసాయరంగం వైపు మళ్లాడు. తన భూమికి ప్రభుత్వం 12 కోట్ల రూపాయల విలువైన పరిహారం చెల్లిస్తామన్నా ఒప్పుకోలేదు. ఈ విషయం కోర్టు వరకు వెళ్లినా, న్యాయం షిటో పక్షానే నిలిచింది. జపాన్ లో షిటో గురించి బాగా ప్రచారం జరిగింది. దాంతో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు దన్నుగా నిలిచాయి. ఈ కారణంగానే అధికారులు కూడా షిటోను ఏమీ చేయలేకపోతున్నారు.  విమానాశ్రయం మధ్యలో ఉన్న తన భూమిలో షిటో ప్రస్తుతం కూరగాయలు పండిస్తున్నాడు.
Takao Shito
Farmer
Narita Airport
Tokyo
Japan

More Telugu News