Raghavendrarao: బాలూ, నువ్వు తప్పకుండా రావాలి... నీకోసం కన్నీటి అభిషేకం చేస్తున్నాం: రాఘవేంద్రరావు

Director Raghavendrarao wishes SP Balu get well soon
  • బాలు కోసం తమిళ సినీ పరిశ్రమ సామూహిక ప్రార్ధన
  • జూమ్ యాప్ ద్వారా ప్రార్థనలు చేసిన ప్రముఖులు
  • భావోద్వేగాలకు లోనైన దర్శకేంద్రుడు
కరోనా మహమ్మారితో తీవ్ర పోరాటం సాగిస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుని క్షేమంగా తిరిగిరావాలంటూ తమిళ చిత్ర పరిశ్రమ ఈ సాయంత్రం 6 గంటల నుంచి జూమ్ యాప్ ద్వారా సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. భారతీరాజా, సత్యరాజ్, రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు బాలు కోసం ప్రార్థించారు. ఈ క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు భావోద్వేగభరితంగా స్పందించారు.

"ప్రపంచంలో ఉన్న నీ అభిమానులం అందరం నీకోసం కన్నీళ్లతో అభిషేకం చేస్తున్నాం బాలూ! నువ్వు తప్పకుండా రావాలి. మైక్ ముందు నీ గంభీరమైన గొంతు వినాలని ఉంది బాలూ. త్వరగా కోలుకుని వచ్చేయ్! నువ్వు కచ్చితంగా వస్తావు... మళ్లీ నీ పాటతో మమ్మల్ని అలరిస్తావు. గెట్ వెల్ సూన్ బాలూ!" అంటూ ఆ గాయక దిగ్గజం కోసం తన సందేశం వినిపించారు.
Raghavendrarao
SP Balasubrahmanyam
Corona Virus
Positive
Mass Prayers
Tamil Film Industry

More Telugu News