Mahmood Ali: నాకు ఉబ్బసం ఉండడంతో కరోనా సోకగానే భయం వేసింది: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ

Telangana home minister Mahmood Ali explains his corona experience
  • ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న మహమూద్ అలీ
  • ఎంతో ధైర్యంగా పోరాడానని వెల్లడి
  • ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపు
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా కరోనా బారినపడి, ఆ మహమ్మారిని జయించి మళ్లీ ఆరోగ్యం సంతరించుకున్నారు. అయితే, తనకు ఉబ్బసం వ్యాధి ఉండడంతో కరోనా సోకగానే ఎంతో భయపడ్డానని వెల్లడించారు. అయినప్పటికీ ధైర్యంగా ఆ వైరస్ తో పోరాడి విజయం సాధించానని తెలిపారు. హైదరాబాదులో జరిగిన ప్లాస్మా దానం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల జీవితాలను కాపాడవచ్చని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. దేశంలో తెలంగాణలోనే కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని తెలిపారు.
Mahmood Ali
Corona Virus
Positiver
Asthama
Plasma Treatment
Telangana

More Telugu News