Raghurama Krishnaraju: కేంద్రమే ఆ మాట అనడం ఎంతో బాధ కలిగించింది: రఘురామకృష్ణరాజు

Narasapuram MP Raghurama Krishnaraju syas he upsets with Centre opinion on AP Capital
  • ఢిల్లీలో రఘురామ మీడియా సమావేశం
  • ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే హక్కు అని పేర్కొన్న కేంద్రం
  • కేంద్రం కౌంటర్ లో కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయన్న రఘురామ
ఏపీ రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంశమని కేంద్రం చెప్పడం కొద్దిగా బాధ కలిగించిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో ఉన్న అంశాలు కొన్ని మనసుకు బాధ కలిగించేవిగా ఉన్నాయని, అంతమాత్రం చేత కలత చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు వివరించారు.

రాష్ట్రం తీసుకువచ్చిన సీఆర్డీయే రద్దు చట్టం గురించి తమకు చెప్పలేదన్న నిజాన్ని కేంద్రం వెల్లడించిందని, చెప్పివుంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుని ఉండేదోనని వ్యాఖ్యానించారు. అందరికీ చెప్పే చేస్తున్నామన్న ఏపీ సర్కారు మరోసారి పచ్చి అబద్ధం చెప్పినట్టు నిరూపితమైందన్నారు. అంతేకాకుండా, కేంద్రం తన కౌంటర్ లో రాజధాని అని మాత్రమే పేర్కొందని, రాజధానులు అని ప్రస్తావించలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పాత సామెత చెప్పిన రఘురామ ఓ సామాజిక వర్గంపై అసహనం వ్యక్తం చేశారు.
Raghurama Krishnaraju
AP Capital
Centre
Amaravati
YSRCP

More Telugu News