Pranab Mukherjee: కాస్త మెరుగుపడ్డ ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యుల ప్రకటన

Pranab Mukherjee have shown slight improvement though he continues
  • న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స
  • శ్వాసకోస పనితీరులో సానుకూల ఫలితాలు
  • స్థిరంగా కీలక అవయవాల పనితీరు 
  • వెంటిలేటర్‌పై చికిత్స 

న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. ఆయన శ్వాసకోస పనితీరులో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. ప్రణబ్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె  వంటి కీలక అవయవాల పనితీరు వంటివి స్థిరంగానే ఉన్నట్లు ప్రకటించింది.

ఆయనను ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని చెప్పింది. కాగా, ప్రణబ్‌కు కరోనా సోకడంతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు వైద్యులు సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు ఇటీవలే ఆర్మీ ఆసుపత్రి తెలిపింది.

  • Loading...

More Telugu News