Swachh Survekshan: 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • నాలుగో సారి ప్రథమ స్థానంలో ఇండోర్ నగరం
  • రెండో స్థానంలో సూరత్ నగరం
  • మూడో స్థానంలో నవీ ముంబై  
  • రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్ ఫస్ట్
Swachh Survekshan 2020 Results Indore Is Indias Cleanest City

స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డుల్లో ఇండోర్ నగరం వరుసగా నాలుగో సారి ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ రోజు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించారు. ఇండోర్‌ తర్వాత సూరత్ నగరం రెండో స్థానంలో నిలవగా మూడో స్థానంలో నవీ ముంబై నిలిచింది.

రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్ వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, 100 కంటే తక్కువ పట్టణ స్థానిక సంస్థలు ఉన్న జాబితాలోని రాష్ట్రాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఝార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది.

More Telugu News